దీదీ ధీమా : మళ్లీ తామే గెలుస్తాం

వచ్చే యేడాది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయ్. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ఎన్నికలకి సంసిద్ధం అవుతున్నాయి రాజకీయ పార్టీలు. ప. బెంగాల్ లో పాగా వేయాలని భాజాపా గట్టి పట్టుదలతో ఉంది. అయ్తే తిరిగి తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, 2021 ఎన్నికల్లో బీజేపీని బెంగాల్‌ నుంచి తరిమి కొడతామని ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రకటించారు.

రాబోయే ఎన్నికలు బెంగాల్‌తో పాటు దేశానికే కొత్త మార్గదర్శకాన్ని చూపించనున్నాయని ఆమె పేర్కొన్నారు. బీజేపీ పాలనలో దేశమంతా భయం భయంగా ఉందని, ప్రజలు నోరు విప్పడానికే జంకుతున్నారని ఆరోపించారు. తృణమూల్ నిర్వహించిన ‘వర్చువల్ ర్యాలీ’లో ఆమె ప్రసంగించారు. తమ ప్రత్యర్థి బీజేపీని సీఎం మమత ‘బెంగాల్‌తో సంబంధం లేని వారు (అవుట్ సైడర్స్) గా అభివర్ణించింది. బెంగాల్‌ను పాలించే అవకాశాన్ని బీజేపీకి ఎప్పటికీ కలిపించమని ప్రకటించారు.