కరోనాతో మాణిక్యాల రావు మృతి

కరోనా బారినపడిన మాజీ మంత్రి, భాజపా నేత పైడికొండల మాణిక్యాల రావు మృతి చెందారు. నెలరోజుల క్రిందటే మాణిక్యాల రావుకి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయన విజయవాడలోని హెల్ప్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నాడు. కరోనాతో పోరాటంలో మాణిక్యాల రావు ఓడిపోయారు. ఆరోగ్యం విషమించడంతో శనివారం తుదిశ్వాస విడిచారు.

బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేసిన 2014 సాధారణ ఎన్నికల్లో తొలిసారి తాడేపల్లిగూడెం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఏపీ దేవాదాయ శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. 2014 నుంచి 2018 వరకూ ఆయన మంత్రిగా పనిచేశారు. మాణిక్యాల రావు మృతిపట్ల  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాణిక్యాల రావు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహణకు అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.