లొంగిపోవడానికి రెడీ అయిన ఇద్దరు మావో అగ్రనేతలు ?

మావోయిస్టు అగ్రనేత గణపతి అనారోగ్య కారణాలతో లొంగిపోతారన్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన దారిలోనే మరో అగ్రనేత మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌ అలియాస్‌ భూపతి కూడా లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు సమాచారమ్.

వేణుగోపాల్ కూడా అనారోగ్య కారణాల వల్లనే లొంగిపోడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఒకవేళ లొంగిపోతే ఆయన కూడా గణపతి తో పాటుగానే లొంగిపోనున్నారని సమాచారం. పార్టీలో కీలక పాత్ర పోషించిన వేణుగోపాల్ 2010లో చెరుకూరి రాజ్‌కుమార్ అలియాస్ ఆజాద్ మరణం తర్వాత పార్టీ అధికార ప్రతినిధిగా నియమించబడ్డారు.