మేడారం హుండీ లెక్కింపు ప్రారంభం

ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతర.. మేడారం. ఇటీవలే ముగిసింది. ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు నాలుగురోజుల పాటు జాతర ఘనంగా జరిగింది. ఈ జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చి వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వనదేవతలకి కానుకలు సమర్పించుకున్నారు. తాజాగా మేడారం మహాజాతర హుండీల లెక్కింపు ప్రారంభమైంది.

సుమారు 200 మంది సిబ్బందితో 494 హుండీలను లెక్కించనున్నారు. హన్మకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలో హుండీల లెక్కింపు కొనసాగుతోంది. హుండీల లెక్కింపు ప్రదేశంలో సీసీ కెమెరాలు, పోలీస్‌ భద్రత ఏర్పాటు చేశామని దేవాదాయశాఖ అధికారులు వెల్లడించారు. జాతరలో సమ్మక్క గద్దె వద్ద 202, సారలమ్మ గద్దె వద్ద 202, గోవింద రాజు గద్దె వద్ద 25 హుండీలు, పగిడిగిద్దరాజు గద్దె వద్ద 28, 38 బట్ట హుండీలను అధికారులు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.