మెగాస్టార్‌ చిరంజీవి ఉగాది కానుక


మెగాస్టార్‌ చిరంజీవి తన అభిమానులకు ఉగాది ట్రీట్‌ ఇవ్వబోతున్నారు. ఇన్నాళ్లూ సోషల్‌ మీడియాకు దూరంగా ఉన్న ఆయన బుధవారం నుంచి ఈ మాధ్యమంలోనూ సందడి చేయబోతున్నారు.

‘ఇక నుంచి నేను కూడా సోషల్‌మీడియాలోకి రావాలి అనుకుంటున్నా. దానికి కారణం ఎప్పటికప్పుడు నా భావాల్ని అభిమానులతో పంచుకోవాలి అనుకోవడమే. నేను చెప్పాలి అనుకుంటున్న సందేశాల్ని ప్రజలతో చెప్పడానికి ఇది వేదికగా భావిస్తున్నా’ అని ఈ సందర్భంగా చిరు అన్నారు.