మగబిడ్డకు జన్మనిచ్చిన మేఘనా సర్జా

దివంగత కన్నడ హీరో చిరంజీవి సర్జా భార్య, నటి మేఘనా సర్జా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. దక్షిణ బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కొద్ది సేపటి క్రితం డెలివరీ జరిగింది. బాబు పుట్టాడని పేర్కొంటూ చిరంజీవి సర్జా సోదరుడు, నటుడు ధ్రువ సర్జా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

చిరంజీవి, మేఘన నిశ్చితార్థం జరిగిన రోజునే బిడ్డ పుట్టాడని, తన కొడుకును చూస్తున్నట్టే ఉందని చిరంజీవి సర్జా తల్లి పేర్కొన్నారు.ఇక మేఘనతో వివాహం తర్వాత కొద్ది నెలలకే చిరంజీవి గుండెపోటుతో మరణించారు. భర్త కటౌట్ పెట్టుకుని సీమంతం చేసుకున్న మేఘన ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయ్.