ట్రాన్స్ జెండర్స్ కోసం మెట్రో స్టేషన్

భారతదేశంలో 4.9 లక్షల మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారని అంచనా. అందులో 30,000 నుండి 35,000 మంది ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సిఆర్) లో ఉన్నారని ఎన్ఎంఆర్సి ఎండి 2011 జనాభా లెక్కల ఆధారంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారికోసం ఓ మెట్రో స్టేషన్ ఏర్పాటైంది. నోయిడాలోని సెక్టార్ 50 స్టేషన్‌ను ట్రాన్స్ జెండర్ల కోసం కేటాయించారు.

దీనికి ‘Rainbow Station’ అని పేరు నిర్ణయించినట్లు నోయిడా మెట్రో రైలు కార్పొరేషన్ బుధవారం (జూన్ 24,2020)న తెలిపింది. ట్రాన్స్ జెండర్ల నుంచి..పలు ఎన్జీవోల నుంచి వచ్చిన సలహాలను పరిగణలోకి తీసుకుని ఏర్పాటు చేశామని నోయిడా అథారిటీ సీఈఓ, ఎన్‌ఎంఆర్‌సి మేనేజింగ్ డైరెక్టర్ రీతూ మహేశ్వరి వెల్లడించారు.