మైక్రోసాఫ్ట్ చేతికి టిక్ టాక్ ?

ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్.. టిక్‌టాక్‌ను కొనుగోలు చేస్తుందని, ఇందుకు గాను టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్‌తో మైక్రోసాఫ్ట్ చర్చలు జరుపుతుందని తెలుస్తోంది. అయితే టిక్‌టాక్‌కు చెందిన అమెరికా బిజినెస్‌ను మాత్రమే మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేస్తుందని అంటున్నారు.

టిక్‌టాక్ మార్కెట్ విలువ ప్రస్తుతం 30 బిలియన్ల నుంచి 50 బిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే టిక్‌టాక్‌ను కొనుగోలు చేసే నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ ఆ యాప్ మొత్తాన్ని కొనుగోలు చేస్తుందా, లేక అమెరికా వరకు హక్కులు ఉండేలా కొనుగోలు చేస్తుందా.. అన్న విషయం తేలాల్సి ఉంది.