తెలుగు రాష్ట్రాలకి మిడతల ముప్పు

తెలుగు రాష్ట్రాలు ఎదుర్కోనున్నాయి. ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాల్లో పంట పొలాలపై మిడతలు దండెత్తుతున్నాయి. ఎకరాల కొద్దీ పంటను స్వాహా చేస్తున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పుడీ మిడతలు తెలుగు రాష్ట్రాల్లోకి ఎంటర్ కాబోతున్నాయి.

ఇవి పాకిస్థాన్ నుంచి ఉత్తర భారతదేశంలోకి ప్రవేశించాయి. రాజస్థాన్‌, గుజరాత్‌, పంజాబ్, మధ్యప్రదేశ్‌, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లోని అనేక జిల్లాల్లో దాదాపుగా 2.05 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతంపై కొన్నికోట్ల మిడతలు దాడి చేశాయి. రాజస్థాన్‌లోనైతే ఏకంగా 5 లక్షల హెక్టార్లలో వేసి పంటలను ఈ మిడతలు తినేశాయి. ఇప్పుడీ మితడతలు తెలుగు రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇచ్చాయని చెబుతున్నారు. వాటి ముప్పుని తప్పించుకొనేందుకు ఉపాయం ఆలోచించాల్సిందే. లేదంటే భారీ నష్టం తప్పదు.