పంత్’కు మైండ్ కోచ్ అవసరం

టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కి మైండ్ కోచ్ అవసరమని అభిప్రాయపడ్డాడు ఆసీస్ మాజీ ఆటగాడు బ్రాడ్ హాగ్. అపారమైన ప్రతిభ రిషబ్ సొంతం. పంత్ బ్యాటింగ్ చూడడానికి ఇష్టపడతా. తనకున్న టాలెంట్‌ను సరిగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు పంత్. అతడు మానసికంగా మరింత పటిష్టం కావడం కోసం మైండ్ కోచ్‌ను సంప్రదించాలన్నాడు.

దాని వలన రిషబ్ మానసికంగా మరింత ధృడంగా మారగలడని హాగ్ పేర్కొన్నాడు. చాలామంది క్రీడాకారులు ఇదే ఫాలో అయ్యారని తెలిపాడు. భారత్ తరపున 13 టెస్టులు, 16 వన్డేలు, 27 టీ20ల్లో భారత్ తరపున ఆడిన రిషబ్‌…ఇటీవల తన నిలకడలేమి ఆటతో పరిమిత ఓవర్ల జట్టులో చోటు కోల్పోయాడు.