లాఠీ పట్టిన మంత్రి..

తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజు కరోనా వైరస్ తాకిడి ఎక్కువ గా ఉండడం తో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకాస్త చర్యలు చేపట్టారు. ప్రజలు రోడ్ల ఫైకి రావొద్దని..మాట వినకపోతే సీరియస్ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అలాగే లాక్ డౌన్‌ను సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత పోలీసులతో పాటు ప్రజాప్రతినిధులపై కూడా ఉందని తెలుపడం తో… నాయకులంతా రోడ్లపైకి వస్తున్నారు.

ఈ క్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్… లాక్ డౌన్‌ను సమీక్షించే క్రమంలో లాఠీ పట్టుకున్నారు. తన సొంత నియోజకవర్గమైన మహబూబ్‌నగర్ పట్టణంలో లాఠీ పట్టుకుని మరీ లాక్ డౌన్‌ను పర్యవేక్షించారు. రోడ్డుపైకి వచ్చిన టూ వీలర్లు, ఫోర్ వీలర్లు, పాదచారులను ఆపి… వాళ్లు ఎందుకు రోడ్డు పైకి వచ్చారో ఆరా తీశారు.