ఎమ్మెల్సీ కొడుకు పేరుతో ఘరానా మోసం

ప్రముఖుల పేర్లని వాడుకొని మోసాలకి పాల్పడుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కొండాపూర్‌కి చెందిన గృహిణి(30)ని ఓ వ్యక్తి.. ఎమ్మెల్సీ కుమారుడిగా పరిచయం చేసుకొని వేధింపులకు పాల్పడిన సంఘటన ఘట్‌కేసర్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం.. సదరు గృహిణికి కొంతకాలం క్రితం భరత్‌కుమార్‌ అలియాస్‌ చింటు అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తాను ఎమ్మెల్సీ కొడుకునని ఆమెకు చెప్పాడు. వారి మధ్య పరిచయం స్నేహంగా మారింది. ఇంతలో భరత్ కుమార్ ట్విస్ట్ ఇచ్చాడు. గృహిణి నుంచి రూ. 15లక్షలు డిమాండ్ చేశాడు. ఇవ్వకుంటే.. ఇద్దరం కలిసి దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించాడు. గృహిణి పోలీసులని ఆశ్రయించడంతో.. భరత్ కుమార్ ని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.