ఐపీఎస్‌ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్.. ప్రధాని ప్రసంగం !

హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో నిర్వహించిన ఐపీఎస్‌ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. ప్రొబేషనరీ ఐపీఎస్‌లను ఉద్దేశించి స్ఫూర్తిదాయక సందేశమిచ్చారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, సహాయక మంత్రి కిషన్‌రెడ్డి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ ఏడాది 131 మంది ఐపీఎస్‌ అధికారులు శిక్షణ పూర్తి చేసుకున్నారు. 121 మంది 2018 బ్యాచ్‌కు చెందినవారు కాగా.. మరో 10 మంది 2017 బ్యాచ్‌కు చెందినవారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో 28 మంది మహిళా ప్రొబేషనర్లు ఉన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో వీరిలో 11 మందిని తెలంగాణకు, ఐదుగురిని ఏపీకి కేటాయించారు.