ప్రపంచానికి భారత్‌ ఫార్మా రంగం సత్తా తెలిసింది : మోడీ

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచానికి భారత్‌ ఫార్మా రంగం సత్తా తెలిసిందని ప్రధాని మోదీ అన్నారు. బ్రిటన్‌ వేదికగా నిర్వహించిన ‘ఇండియా గ్లోబల్‌ వీక్‌-2020’ సదస్సులో దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన మాట్లాడారు. విపత్తు వేళ భారత ఫార్మా రంగం దేశానికే కాదు.. ప్రపంచానికి సైతం ఒక ఆస్తిగా మారిందన్నారు. ఔషధాల ధరలు తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషించిందని చెప్పారు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది అక్కరకు వచ్చిందన్నారు.

కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నుంచి ప్రపంచం గట్టెక్కడంలో భారత్‌ కీలక పాత్ర పోషించబోతోందని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ప్రపంచ దిగ్గజ సంస్థలను ఈ సందర్భంగా ఆహ్వానించారు. పెట్టుబడులు పెట్టేవారికి తాము రెడ్‌ కార్పెట్‌ పరుస్తున్నామని చెప్పారు.

Spread the love