మోహన్ బాబు ఫాంహౌస్‌ వద్ద యువకుల హల్ చల్

సీనియర్ నటుడు మోహన్‌బాబు ఫాంహౌస్‌ వద్ద యువకులు హల్ చేశారు. శనివారం రాత్రి జల్పల్లిలోని ఆయన ఫాం హౌస్‌లోకి కొంతమంది దుండగులు దూసుకెళ్లి… మిమ్మల్ని వదలమంటూ కుటుంబ సభ్యులను హెచ్చరించారు.

దీనిపై పహాడిషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఏపీ 31ఏఎన్‌ 0004 ఇన్నోవా కారులో దుండగులు వచ్చినట్లు మోహన్‌బాబు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ, కారు నంబర్‌ ఆధారంగా దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని మైలార్‌దేవ్‌పల్లి దుర్గానగర్‌కు చెందిన యువకులుగా గుర్తించారు.

Spread the love