తెరాస.. ఓ కమెడియన్ల పార్టీ !

టీఆర్ఎస్ పార్టీ కామెడియన్ల పార్టీ అని.. వారంతా సోమరిపోతులని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. బ్రహ్మానందంతో కేసీఆర్.. బాబుమోహన్ తో కేటీఆర్ పోటీపడ్తున్నారు. ఒక్క పరిశ్రమను కూడా కేటీఆర్ హైద్రాబాద్ కు తీసుకు రాలేకపోయాడు.

మూసీ నదిలో బోటింగ్ చేస్తునట్టు కేసీఆర్, కేటీఆర్ ఎదురు పడినట్లు నాకు కలలు వస్తున్నాయి అని అరవింద్ సెటైర్లు వేశాడు.కరోనాతో ప్రజలు చనిపోతుంటే.. లాక్ డౌన్ సమయంలో కేటీఆర్ సినిమాలు చూస్తుకూర్చోచటం సిగ్గుచేటు.. సచివాలయం పోనీ కేసీఆర్ .. దేశానికి దిశ దశా చూపుతామనటం హాస్యాస్పదం అన్నారు.

Spread the love