ఎంపీ అరవింద్’పై దాడి

భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ కాన్వాయ్‌పై దాడి జరిగింది. ఆయన కాన్వాయ్ పైకి తెరాస కార్యకర్తలు దూసుకొచ్చారు. రాళు, కోడిగుట్లు విసిరారు. ఆదివారం వరంగల్ అర్బన్‌ జిల్లా భాజపా కార్యాలయంలో ఎంపీ విలేకరుల సమావేశం నిర్వహించారు.

అనంతరం బయటకు వెళ్తున్న సమయంలో కొంతమంది తెరాస కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు వచ్చారు. కాన్వాయ్‌పై దాడి చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోటాపోటీగా నినాదాలు చేస్తున్న ఇరుపార్టీల కార్యకర్తల మధ్య తోపులాట కూడా జరిగింది. తెరాస కార్యకర్తలను పోలీసు స్టేషన్‌కు తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది.

Spread the love