ఎంపీ మోహన్ దేల్కర్ ఆత్మహత్య

లోక్ సభ సభ్యుడు మోహన్ దేల్కర్ ఆత్మహత్య చేసుకున్నారు. ముంబయి మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో ఉన్న సీ గ్రీన్ సౌత్ హోటల్ గదిలో ఆయన విగతజీవుడిగా కనిపించారు. ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

హోటల్ గదిలో గుజరాతీ భాషలో ఉన్న సూసైడ్ నోట్ లభ్యమైనట్టు తెలుస్తోంది. సిల్వస్సా ప్రాంతంలో ఓ వ్యవసాయదారుల కుటుంబంలో జన్మించిన మోహన్ దేల్కర్ రాజకీయాల్లో విశేష ప్రభావం చూపించారు. మోహన్ దేల్కర్ ఏడు పర్యాయాలు ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికల వేళ కాంగ్రెస్ ను వీడారు. ప్రస్తుతం ఆయన స్వతంత్ర ఎంపీగా ఉన్నారు. 58 ఏళ్ల మోహన్ దేల్కర్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Spread the love