‘జూ’లపై పడ్ద ముఖేష్

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రపంచంలోని అతి పెద్ద జంతు ప్రదర్శనశాలని నిర్మిస్తున్నారు. ఆయన సొంత రాష్ట్రం గుజరాత్ లో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఈ జూలో ఎన్నో రకాల జంతువులు, పక్షులు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉపయోగపడేలా రెస్క్యూ సెంటర్ కూడా ఇందులో ఉంటుంది.

2023లో ఇది ప్రారంభమవుతుందని రిలయన్స్ కార్పొరేట్ అఫైర్స్ డైరెక్టర్ పరిమళ్ నత్వానీ తెలిపారు. అయితే ఈ ప్రాజెక్టుకు అవుతున్న ఖర్చు, ఇతర వివరాలను వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. అడుగుపెట్టిన అన్నీ రంగాల్లో ముఖేష్ దూసుకుతున్నారు. ఇప్పుడు.. ఆయన ‘జూ’లపై పడ్డారు. మరీ.. జంతువులని కూడా కమర్షియల్ చేస్తారేమో.. !

Spread the love