విజయవాడలో దారుణం

విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. విజయవాడలోని మాచవరంలో చిన్న స్వామి అనే ప్రేమోన్మాది తనని ప్రేమించడం లేదన్న కోపంటో దివ్య తేజస్విని అనే ఇంజనీరింగ్ విద్యార్థినిపై కత్తితో దాడిచేశాడు. తన ప్రేమను నిరాకరించిందని ఏకంగా తేజస్విని ఇంటికెళ్లి మరీ ఈ దురాగతానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. కత్తితో ఆమె మెడపై నరకడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది.

అయితే ఆమెని అలా చూసిన ఆ ప్రేమోన్మాది తనను తాను కత్తితో గాయపర్చుకున్నాడు. ఆమెను, అతడిని ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా ఆమె చికిత్స పొందుతూ మరణించింది. ప్రస్తుతం స్వామి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్టు సమాచారం. ఇంజనీరింగ్ చాడువ్తోన్న తేజస్వినిని స్వామి ప్రేమించమని వేధింపులకు గురిచేస్తున్నట్టుగా చెబుతున్నారు.