సీఎం కేసీఆర్ కు రాయలసీమ నేత సపోర్ట్

తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ నీళ్ల లొల్లి మొదలైన సంగతి తెలిసిందే. పొతిరెడ్డి పాడు నుంచి రాయలసీమకి ఏపీ ప్రభుత్వం నీళ్లని తోడుకుపోయేందుకు ప్లాన్ చేసింది. ఇందుకు సంబంధించి 203జీవోని విడుదల చేసింది. దీన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి ఏపీ, తెలంగాణ నేతల మధ్య విమర్శలు జోరందుకున్నాయి.

అయితే రాయలసీమ కీలాక నేత, మాజీ ఎంపీ మైసూరరెడ్డి మాత్రం సీఎం కేసీఆర్ కి సపోర్ట్ చేయడం విశేషం. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు, రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదన్నారు మాజీ ఎంపీ మైసూరారెడ్డి. ఉన్న ప్రాజెక్టులను పూర్తిగా వినియోగించుకుంటే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని ముందు వాటిపై దృష్టి పెట్టాలని సూచించారు. సీఎం జగన్ నిర్ణయాలతో రాయలసీమకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు.