చార్టెట్ ఫ్లైట్ కొనేసిన నాగార్జున ?

కింగ్ నాగార్జునకు సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆయన సొంతంగా చార్టర్ ఫ్లైట్ కొంటున్నారని, కొనేశారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలో క్లారిటీ రావాల్సి వచ్చింది. ఉన్నట్టుంది నాగ్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అంటే.. ? చెన్నైలోని తన సోదరుడికి సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి అక్కడికెళ్లిన నాగార్జునకు చార్టెట్ ఫ్లైట్ ఆలోచన వచ్చినట్లు టాక్ నడుస్తోంది.

ఆలోచన రావడమే తర్వాయి వెంటనే నాగ్ చార్టర్ ఫైట్ కి ఆర్డర్ చేశారు. అది వచ్చిసేంది అనే ప్రచారం జరుగుతోంది. ఇక సినిమాల విషయానికొస్తే తెలుగులో నెమ్మదిగా సినిమాలు చేస్తున్నారు. మునుపటిలా కాకుండా మంచి కథలు దొరికితేనే చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన తనయులు చైతూ, అఖిల్ హీరోలుగా రాణిస్తున్న సంగతి తెలిసిందే.