కరోనా భయంతో నాగశౌర్య ఏం చేశాడో తెలుసా ?

కరోనా మహమ్మారికి సామాన్యుడు, సెలబ్రిటీ అనే తేడానే లేదు. అందరికీ సోకుతోంది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. పడుతున్నారు. ఇటీవల నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌కి కరోనా సోకడంతో టాలీవుడ్ ఉలిక్కిపడింది. బండ్ల గణేష్ నివసించే ప్రాంతంలోనే నాగశౌర్య అతని ఫ్యామిలీ కూడా నివసిస్తున్నారు.

దీంతో నాగశౌర్య తన ఫ్యామిలీని తీసుకొని ఫాం హౌజ్‌కి వెళ్లినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సినిమాలు కూడా లేకపోవడంతో హైదరాబాద్‌లోని తన ఫాం హౌజ్‌లో కొద్ది రోజులు ఉండాలని అనుకున్నాడట నాగశౌర్య. ఫోన్ కాల్స్ ద్వారా ఫిలిం మేకర్స్‌కి అందుబాటులో ఉంటాడని సమాచారం.

Spread the love