గంగూలీకి అనారోగ్యంపై నగ్మా స్పందన

టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టు చెబుతున్నారు. గంగూలీ ఆరోగ్యంపై పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. అందులో సీనియర్ నటి, కాంగ్రెస్ నాయకురాలు నగ్మా కూడా ఉన్నారు.

ఒకప్పుడు ఈమెకు దాదాతో మంచి సాన్నిహిత్యం ఉండేది. ఇద్దరి మధ్య ఎఫైర్ కూడా నడిచిందనే వార్తలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే ‘సౌరవ్ గంగూలీ త్వరగా కోలుకోవాలి.. గెట్ వెల్ సూన్.. ప్రార్థిస్తున్నా’ అంటూ ట్వీట్ చేసింది నగ్మా. గంగూలీ ప్రస్తుతం కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Spread the love