నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు పూర్తి

తెరాస సీనియర్ నేత, మాజీ మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ముగిశాయి. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నాయిని అంత్యక్రియలు నిర్వహించారు. గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపి నివాళులర్పించారు.

నాయినిని కడసారి చూసేందుకు టీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు. నాయిని అంత్యక్రియల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ.. జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాయిని.. బుధవారం అర్ధరాత్రి పరిస్థితి విషమించడంతో 12.25 గంటలకు మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించిన విషయం తెలిసిందే.