నాయినిని పరామర్శించిన సీఎం కేసీఆర్

అనారోగ్యంతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డికి సీఎం కేసీఆర్ పరామర్శించారు. నాయిని కుటుంబ సభ్యులను సీఎం ఓదార్చారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలని ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. వాటిని చూస్తే నాయిని ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని తెలుస్తోంది. ఏ క్షణమైన విషాద వార్త రావొచ్చని తెలుస్తోంది.

గతనెల 28న నాయిని నర్సింహారెడ్డికి కరోనా సోకింది. అప్పటి నుంచి ఆయన హైదరాబాద్ బంజారాహిల్స్ లోని సిటీ న్యూరో సెంటర్ హాస్పటల్‌లో చేరి చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఆయనకి ఒక్కసారిగా ఊపిరి ఆడకపోవడంతో అపోలో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఆయనకి ఊపిరితి తిత్తులో ఇన్ ఫెక్షన్ ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారు. చికిత్స అందిస్తున్నారు. అయితే చికిత్సకి నాయిని బాడీ సహకరించడం లేదని తెలుస్తోంది. రోజురోజుకి నాయిని ఆరోగ్యం క్షీనిస్తుందని చెబుతున్నారు.