‘నగ్నం’ టైటిల్ సాంగ్

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు కరోనాతో భయం లేదు. ఆయన నుంచి ఎప్పటిలాగే సినిమాలు క్యూ కడుతున్నాయి. ఓటీటీలో ఆయన సినిమాలు వరుసగా రిలీజ్ అవుతున్నాయ్. ఇటీవలే క్లైమాక్స్ సినిమాని రిలీజ్ చేశారు. తాజాగా నగ్నం సినిమాని తీసుకుస్తున్నారు. రేపే రిలీజ్. తాజాగా ఈ సినిమా టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేశారు.

టైటిల్ కి తగ్గట్టుగానే నగ్నంగా పాటని చూపించే ప్రయత్నం చేశాడు. ఇప్పటికే రిలీజైన పోటోలని జోడించి.. మరికొన్ని కొత్త బిట్ సీన్స్ తో టైటిల్ సాంగ్ ని రక్తికట్టించే ప్రయత్నం చేశారు వర్మ. అయితే ఈ సినిమాలో హాట్ హాట్ పోజులే తప్ప మేటర్ ఏమీ ఉండదనే ప్రచారం కూడా జరుగుతోంది. దీనిపై రేపటితో తేలనుంది.