నమ్రత ఎమోషనల్ పోస్ట్ 


మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్ ల కు వివాహమై నేటికి 15 సంవత్సరాలు. కాగా, నమ్రత, తన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.

“ప్రతి యువతీ కలలుగనే ఓ అద్భుతమైన ప్రపంచాన్ని నాకు అందించావు. నా జీవితమంతా నీ స్వచ్ఛమైన ప్రేమతో, ముద్దులొలికే మన ఇద్దరు పిల్లలతో నింపేశావు. నీ ప్రేమానురాగాలతో మన ఇల్లు ఎప్పుడూ నందనవనమే. నీ సాహచర్యం నాకెప్పుడూ ఉంటేచాలు. నాకు ఇంతకన్నా ఏం కావాలి?. నా ప్రియాతి ప్రియమైన మహేశ్‌ కు 15వ మ్యారేజ్ డే శుభాకాంక్షలు’ అని ఇన్‌ స్టాగ్రామ్‌ లో నమ్రత పోస్ట్ చేసింది.