నిమ్మగడ్డ ఏమీ చేయలేరు : నాని

నిమ్మగడ్డ వర్సెస్ ఏపీ ప్రభుత్వం వివాదం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్దం కావడంతో ప్రభుత్వం మళ్ళీ నిమ్మగడ్డ మీద కామెంట్స్ మొదలు పెట్టింది. తాజాగా నిమ్మగడ్డపై మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు.

రాష్ట్రంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేను చెప్పిందే వేదం అనే విధంగా వ్యవహరిస్తున్నాడని, అది సరైన చర్య కాదని అన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో కొన్ని నెలల మాత్రమే ఉంటాడని తరువాత రిటైర్డ్ అయ్యి హైదరాబాదు లో ఉంటాడని ఆయన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కన్నా ప్రజల శ్రేయస్సు ముఖ్యమని అయన అన్నారు. ఆయన ప్రభుత్వాన్ని సంప్రదించకుండా నిమ్మగడ్డ రమేష్ ఏమీ చెయ్యలేరని అన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్టి లో ఉంచుకుని , స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచన ప్రస్తుతం ప్రభుత్వానికి లేదన్నారు. ఎన్నికల నిర్వహణ అనేది ఎన్నికల సంఘం చూసుకుంటుంది అన్న విషయం బహుశా.. నానికి తెలియదేమో.. !