వెబ్ సిరీస్ లు నిర్మిస్తా : నాని

దర్శక-నిర్మాతలు, హీరోలు డిజిటల్ ఫ్లాట్ ఫాం వైపు మొగ్గు చూపుతున్నారు. ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ ల నిర్మాణానికి ఆసక్తి ని చూపిస్తున్నారు నేచురల్ స్టార్ నాని కూడా వెబ్ సిరీస్ లు నిర్మిస్తా అంటున్నారు. ఆయన తాజా చిత్రం ‘వి’ ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 5న వి అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. ఈ రోజే ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

ఈ నేపథ్యంలో మీడియాతో నాని మాట్లాడారు. “నేను సినిమా మనిషిని. 20-30 ఎపిసోడ్‌లున్న సిరీస్‌ల కన్నా సినిమా పనినే ఎక్కువగా ఎంజాయ్‌ చేస్తా. వెబ్‌ సిరీస్‌లు నిర్మించే అవకాశం ఉంది. కానీ వాటిల్లో నటించాలన్న ఆలోచన ఇంకా రాలేదు. ఏమో ఏదైనా జరగొచ్చు. ‘వి’ చిత్రంలో నా క్యారెక్టర్‌ యునిక్‌గా ఉంటుంది. అలాగే యునిక్‌గా ఓటీటీలో విడుదల కానుంది. అక్టోబర్‌లో ‘టక్‌ జగదీశ్‌’ సినిమా షూటింగ్‌ మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాం. వచ్చే ఏడాది ప్రారంభంలో ట్రైలర్‌ విడుదల చేయాలనుకుంటున్నాం” అన్నారు నాని.