మంత్రి నాని అనుచరుడు దారుణ హత్య

ఏపీ మంత్రి పేర్ని నాని ప్రధాన అనచరుడు మోకా భాస్కరరావు దారుణ హత్యకు గురయ్యాడు. మునిసిపల్ చేపల మార్కెట్‌లో భాస్కర్ రావుని ఓ కత్తితో పొడిచి పరారయ్యాడు. దాడిలో గాయపడిన భాస్కరరావు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కత్తికి సైనేడ్ పూసి పొడిచినట్టు వైద్యులు భావిస్తున్నారు.

భాస్కరరావు హత్యలో నలుగురు వ్యక్తులు పాల్గొన్నట్టు సీసీ టీవీ ఫుటేజ్‌ ద్వారా పోలీసులు గుర్తించారు. భాస్కరరావు ఛాతీలో పొడిచిన ఒకే ఒక్క పోటు బలంగా దిగడంతో భాస్కర్ రావు గుండెకు బలమైన గాయమైనట్లు వైద్యులు గుర్తించారు. భాస్కర్ రావును హత్య చేసిన తర్వాత బైక్‌పై పరారవుతున్న సీసీ టీవీ ఫుటేజ్‌ను పోలీసులు సేకరించారు. భాస్కరరావును పొడిచిన అనంతరం రోడ్డుపై అప్పటికే సిద్ధంగా ఉంచిన బైక్ ఎక్కి ఒకరు పరారయ్యారు.

Spread the love