అంటి అడ్డాలపై నట్టి కుమార్ ఫిర్యాదు

టాలీవుడ్ లో నట్టి కుమార్ వర్సెస్ చంటి అడ్డాల వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ‘ఐనా ఇష్టం నువ్వే’ సినిమాని చంటి అడ్డాల మొదట నట్టి కుమార్ కు అమ్మారు. ఆతర్వాత మరో నిర్మాతకు కూడా అమ్మారని నట్టి కుమార్ ఆరోపిస్తున్నారు. దీనిపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు నట్టికుమార్.

ఈ సందర్భంగా నట్టికుమార్ మాట్లాడుతూ… ‘ఐనా ఇష్టం నువ్వే’ హక్కులు అమ్మినందుకు గాను.. రూ.9 లక్షల చెక్ ఇచ్చాను. బ్యాంకు అకౌంట్ లో అమౌంట్ ఉంది. కానీ చంటి అడ్డాల బ్యాంకులో చెక్ వేయకుండా… నా మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నేను కూడా ఈ రోజు తగిన ఆధారాలు పోలీసులకు ఇచ్చి… చంటి అడ్డాల చేస్తున్న వైట్ కాలర్ మోసాలపై ఫిర్యాదు చేసాను. సినిమాను మొదట నాకు అమ్మి.. ఆ తరువాత టైటిల్ మార్చి వేరేవాళ్లకు అమ్మి నన్ను మోసం చేసాని చెప్పుకొచ్చారు.