నవాజుద్దీన్ ఫ్యామిలీ టార్చర్ భరించలేకపోయా : ఆలియా

వైవిధ్యమైన నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తిన సంగతి తెలిసిందే. ఇటీవల నవాజుద్దీన్ సిద్ధిఖీ రెండో భార్య ఆలియా విడాకులు కావాలని లీగల్ నోటీసులు పంపింది. కరోనా లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో ఇ-మెయిల్‌, వాట్సాప్‌ల ద్వారా నోటీసులు పంపినట్లు అలియా తరఫు లాయర్‌ అభయ్‌ తెలిపారు.

ఇంతకీ నవాజుద్దీన్ తో ఎందుకు విడిపోవాలనుకుంటున్నది ఆయన భార్య అలియా చెప్పింది. నవాజుద్దీన్ ఎప్పుడు తనపై చేయి చేసుకోలేదు. కానీ ఆయన భయంకరమైన అరుపులు భరించలేం. ఇక ఆయన ఫ్యామిలీ టార్చర్ చేసింది. సిద్ధిఖీ సోదరుడు నాపై చేయి కూడా చేసుకున్నాడు. అతని తల్లి, సోదరులు, వదిన అంతా ముంబైలోనే కలిసి ఉంటారు. నేను వాళ్ళతో చాన్నాళ్లు కలిసి జీవించాను. వారి టార్చర్ భరించలేకనే మొదటి భార్య కూడా వదిలి వెళ్ళింది. తాను ఆ కారణంతోనే విడాకులు తీసుకోవాలనుకుంటున్నానని చెప్పింది.