విషాదం : నవాజుద్దీన్ సిద్దిఖీ ఇంట్లో విషాదం

బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరి స్యామా తామ్షీ సిద్ధిఖీ (26) అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఆమె శనివారం నాడు మరణించినట్లు సిద్ధిఖీ కుటుంబసభ్యులు తెలిపారు. పద్దెమినిదేళ్ల వయస్సులోనే స్యామా బ్రెస్ట్‌ క్యాన్సర్‌ బారిన పడింది. స్యామా 25వ పుట్టినరోజు సందర్భంగా… చిన్న వయస్సు నుంచే తన చిట్టి చెల్లెలు చావుతో ధైర్యంగా పోరాడుతోందని నవాజుద్దీన్ చెప్పిన సంగతి తెలిసిందే.

ఉత్తరప్రదేష్ లోని బుధనా నవాజుదీన్ సొంత గ్రామం. అక్కడే స్యామా అంత్యక్రియలు నిర్వహించినట్లు సమాచారం. ప్రస్తుతం జవాజుద్దీన్ అమెరికాలో ఉన్నారు. ‘సేక్రెడ్ గేమ్స్’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సిరీస్ మూడో సీజన్ కి సిద్ధమవుతోంది. చెల్లెలి మరణ వార్త వినగానే అమెరికాను నుంచి ఇండియాకు హుటాహుటిన వచ్చినట్లు తెలుస్తోంది.