గంగూలీ దూకుడు టీమిండియా ముఖ చిత్రాన్ని మార్చేసింది

టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీ బాస్ గంగూలీ దూకుడుని మెచ్చుకున్నారు ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ నాజర్‌ హుస్సేన్. 2000 నుంచి 2005 వరకు గంగూలీ టీమిండియాకు నాయకత్వం వహించి దూకుడుగా ఆడటమే కాకుండా అద్భుత విజయాలను సొంతం చేసుకొన్న యుగంగా గుర్తించబడిందన్నారు.

గంగూలీ కన్నా ముందున్న జట్టు ఎంతో వినయపూర్వకమైనదని, మర్యాదగలదని ప్రశంసించారు. గంగూలీ భారత క్రికెట్‌ను మార్చిన గొప్ప ఆటగాడన్నారు. ఆయన కారణంగా భారత క్రికెట్‌కు ఎనలేని పేరు ప్రతిష్ఠలు వచ్చాయని చెప్పారు. జట్టు సభ్యులను ఉద్రేకపూరితంగా మార్చడంలో గంగూలి సఫలీకృతుడయ్యారని తెలిపారు. 2002లో నాట్‌వెస్ట్‌ సిరీస్‌లో మ్యాచ్‌ గెలువగానే చొక్కా విప్పి గాల్లో తిప్పడం ఒక్క గంగూలీకే చెల్లుతుందని నాజర్ అన్నారు.