చంద్రబాబు ఇంటి వివాదం

తెదేపా అధినేత చంద్రబాబు ఇంటి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. కృష్ణానదికి ప్రమాదకర స్థాయిలో వరద వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు కరకట్టపై నిర్మించిన అక్రమ నివాసాన్ని వదిలివెళ్లాలని మంత్రి అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. అయితే మంత్రి అనిల్ మాటలని తెదేపా నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. చంద్రబాబు విజనరీ ఉన్న నేత. పడగొట్టే ప్రిజనరీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డిది అని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ అన్నారు.

చంద్రబాబు నిర్మించిన సైబరాబాద్, అమరావతి.. వరదలకు మునగలేదనే విషయం అనిల్ గుర్తుపెట్టుకోవాలని ఒకింత కౌంటరిచ్చారు. జగన్ రెడ్డి దరిద్ర పాదం వల్ల రాష్ట్రం 17 నెలలుగా వణికిపోతోందని చెప్పుకొచ్చారు. వరదలు వచ్చినా సాగునీరు ఇవ్వలేని మంత్రి అనిల్‌.. నీటి పారుదలశాఖకి రాజీనామా చేసి నోటి పారుదలశాఖ తీసుకోవాలని అనురాధ సూచించారు.