నీట్ ఫలితాలు విడుదల

దేశ వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను జాతీయ పరీక్షల ఏజెన్సీ (ఎన్‌టీఏ) శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో (2020-21) ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ 13న జాతీయ అర్హత ప్రవేశపరీక్ష (నీట్‌) నిర్వహించిన విషయం తెలిసిందే.

ఈ పరీక్షకు 14.37లక్షల మందికి పైగా (90శాతం మంది) హజరయ్యారు. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ 3,862 కేంద్రాల్లో ఈ పరీక్షను పకడ్బందీగా నిర్వహించారు. సెప్టెంబర్‌ 13న కరోనా నేపథ్యంలో హాజరు కాని విద్యార్థులకు ఈ నెల 14న ప్రత్యేకంగా పరీక్ష రాసే అవకాశం కల్పించారు. ఈ రెండు పరీక్షల ఫలితాలను కలిపి అధికారులు http://ntaneet.nic.in/ వెబ్‌సైట్‌ ద్వారా శుక్రవారం విడుదల చేశారు.