రాహుల్ గాంధీని టార్గెట్ చేసిన నెటిజన్స్

కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ బుక్కయ్యాడు. ఓ వైపు దేశానికి కరోనా ఫీవర్ పట్టుకుంది. కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందుకోసం మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల ప్రపంచం, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో రాహుల్ గాంధీ రాజకీయం చేయడం వివాదాస్పందంగా మారింది.

దేశంలో కరోనా వైరస్ వ్యాపించకుండా నియంత్రించడంలో విఫలమైన మోడీ ప్రభుత్వం.. ప్రజలను చప్పట్లు కొట్టాలంటూ పురిగొల్పడం ఏంటని రాహుల్ గాంధీ తన ట్వీట్ లో విమర్శించారు. ఈ ట్వీట్ ఇపుడు వైరల్ అయింది. ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేలా దేశాన్ని రెడీ చేయలేకపోవడం వెనుక యాభై ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ నేతల పాత్ర ఏమీ లేదా రాహుల్ జీ అంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు.