మహిళా రక్షణ కోసం సరికొత్త యాప్‌

ఏపీ ప్రభుత్వం మహిళా రాక్షణ కోసం సరికొత్త యాప్ ని తీసుకురానుంది. ఇవాళ్టీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిమందే. అసెంబ్లీలో మహిళా భద్రతపై స్వల్పకాలిక చర్చలో భాగంగా హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడారు. హెల్ప్‌లైన్‌ నెంబర్ల ద్వారా మహిళలకు మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. మహిళల్లో అవగాహన విశ్వాసం నింపేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

మహిళల కోసం సైబర్‌ మిత్రా ఏర్పాటు చేశామని, 9121211100 సైబర్‌ మిత్రా వాట్సాప్‌ నెంబర్ జీరో ఎఫ్‌ఐఆర్‌ అమలుకు డీజీపీ ఆదేశాలిచ్చారని మంత్రి పేర్కొన్నారు. పోస్కో కేసుల పరిష్కారం కోసం 8 ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేశామని, ఆత్మహత్యలు, ఒత్తిడి నివారణకు మహిళలకు కౌన్సిలింగ్‌ ఇప్పిస్తున్నామని హోంమంత్రి తెలిపారు.