కంటైన్మెంట్లలో కొత్త రూల్స్ ఇవే !

కరోనా విషయంలోనూ ఏపీ సర్కార్ దూకుడుగానే వ్యవహరిస్తోంది. కరోనా టెస్టులు చేయడంలోనూ, లాక్‌డౌన్ సడలింపుల్లోనూ వేగంగా పని చేస్తోంది. తాజాగా కంటైన్మెంట్ జోన్ల పరిధిని తగ్గించారు. కానీ నిబంధనలు మాత్రం కఠినంగానే అమలు చేయాలని అధికారులకు సూచించారు.

ఇప్పటి వరకు కంటోన్మెంట్ జోన్ల పరిధి 3 కిలోమీటర్ల వరకు ఉండగా అది కేవలం 200 మీటర్లకు మాత్రమే పరిమితమైంది. ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఎవరూ ఇళ్లు దాటి బయటకు రాకూడదని హెచ్చరిస్తున్నారు. ఐసీఎంఆర్‌ ఆదేశాల ప్రకారం కంటైన్‌మెంట్‌ జోన్లను మూడు రకాలుగా వర్గీకరించారు.

10 కి మించి కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ‘మోస్ట్ యాక్టివ్’, పదిలోపు కేసులుంటే ‘ యాక్టివ్‌ ‘ అంత కన్నా తక్కువగా ఉంటే ‘డార్న్ మెంట్’ ప్రాంతాలుగా గుర్తిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఇప్పటి వరకు ఉన్న కంటైన్మెంట్ ప్రాంతాల్లో ప్రజలకు కాస్త ఊరట లభించనుంది.