మరోసారి కోర్టుకు నిమ్మగడ్డ

స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏపీ ప్రభుత్వం, ఎస్ఈసీ మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం సహకరించడం లేదనే విషయాన్ని ఎస్ఈసీ కోర్టు దృష్టికి తీసుకెళ్లనుంది. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణ కోసం రెండు సార్లు లేఖలు రాసినా అంగీకరించ లేదనే విషయాన్ని సైతం కోర్టు దృష్టికి తీసుకెళ్లే యోచనలో ఎస్ఈసీ ఉంది. తాము సంప్రదింపులు జరుపుతున్నా.. ప్రభుత్వం సహకరించడం లేదనడానికి ఇదే నిదర్శనమని ఎస్ఈసీ వర్గాలు చెబుతున్నాయి.

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేస్ కుమార్ మరోసారి సీఎస్ నీలం సాహ్నీకి లేఖ రాశారు. గురువారం ఏర్పాటు చేయనున్న వీడియో కాన్ఫరెన్స్‌కు అధికారులు హాజరయ్యేలా చూడాలని ఆ లేఖలో కోరారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై చర్చకు సమావేశం కావాలని నిర్ణయించినట్లు కూడా ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు