రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సెక్రటరీగా ఉన్న వాణీ మోహన్‌ను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎస్‌కు లేఖ రాశారు. వాణీమోహన్ సేవలు ఎన్నికల కమిషన్‌లో అవసరం లేదని లేఖలో తెలిపారు. వాణీమోహన్‌ను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ జీవీ సాయి ప్రసాద్‌పై కూడా క్రమశిక్షణ చర్యలు చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. 30 రోజులపాటు సెలవుపై వెళ్లిన సాయిప్రసాద్.. ఇతర ఉద్యోగులను సైతం సెలవుపై వెళ్లేలా ప్రభావితం చేశారని అభియోగాలు ఉన్నాయి. దీన్ని క్రమశిక్షణారాహిత్యంగా పరిగణించి అతడిని విధుల నుంచి తొలగించింది.
Spread the love