టీడీపీలో నిమ్మగడ్డకు పదవి ఖరారు

ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఖాయమైనట్టుగా ఉందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు.

‘నిమ్మగడ్డ రమేష్ రిటైర్మెంట్ తర్వాత ఆయన్ను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడం ఖాయం అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అలానే, ఎన్టీఆర్ ను చంద్రబాబు దింపేసి పార్టీని లాక్కున్నట్టే.. నాలుగు నెలల తర్వాత టీడీపీ తెరవెనుక పెద్దలంతా బాబును దింపి నిమ్మగడ్డ రమేష్ ను కూర్చోబెట్టడం ఖాయం అనిపిస్తోంది.’ అని విజయసాయిరెడ్డి ట్విట్ చేశారు.