గవర్నర్ ని కలిసిన నిమ్మగడ్డ

ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ సోమవారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. విజయవాడలోని రాజ్ భవన్ కు వెళ్లి భేటీ అయ్యారు. పంచాయతె ఎన్నికలు జరిగిన తీరును గవర్నర్ కు ఎస్ఈసీ వివరించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని తెలిపారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణ గురించి కూడా గవర్నర్ కు వివరించారు.

నాలుగు దశల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల వివరాలు, ఏకగ్రీవాలు తదితర సమాచారంతో కూడిన నివేదికను గవర్నర్ కు సమర్పించినట్టు తెలుస్తోంది. దాదాపు అరగంట సేపు వీరి భేటీ కొనసాగింది. అయితే పంచాయతీ ఎన్నికల నిర్వహణలో మొదటి నుంచి ఏపీ ప్రభుత్వం ఎస్ ఈసీ మధ్య వివాదం నెలకొంటూ వస్తున్న సంగతి తెలిసిందే.

Spread the love