నిర్భయ దోషుల క్యురేటివ్‌ పిటిషన్‌ విచారణ ఎప్పుడంటే ?

నిర్భయ దోషులకు డెత్‌ వారెంట్‌ జారీ చేస్తూ దిల్లీ పటియాలా కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈనెల 22న ఉదయం 7గంటలకు తిహార్‌ జైల్లో వీరిని ఉరి తీయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఆలోగా దోషులు తమకున్న న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోవచ్చని సూచించింది. ఈ నేపథ్యంలోనే వినయ్‌ శర్మ, ముకేశ్‌ క్యురేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

నిర్భయ ఘటన జరిగిన సమయానికి తనకు 19 సంవత్సరాలేనని వినయ్‌ శర్మ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. తన కుటుంబం చాలా పేదదని, తాను లేకపోతే తల్లిదండ్రులు అన్యాయమైపోతారని వాళ్లు చనిపోయే పరిస్థితి ఏర్పడుతుందని వాపోయాడు. జైలులో తన సత్ర్పవర్తనను పరిగణలోకి తీసుకొని మరణశిక్ష నుంచి విముక్తి కల్పించాలని వినయ్‌శర్మ తన పిటిషన్‌ ద్వారా న్యాయస్థానాన్ని కోరాడు. నిర్భయ దోషులు ఇద్దరు వేసిన క్యురేటివ్‌ పిటిషన్లను ఈనెల 14న సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేయనుంది.

Spread the love