‘నిశ్శబ్దం’కు ముహూర్తం పెట్టారు


అనుష్క, మాధవన్‌ ప్రధాన పాత్రల్లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో చిత్రం తెరకెక్కుతోంది. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది . హిందీ, తమిళంలో ‘సైలెన్స్‌’ అనే పేరు పెట్టారు. తెలుగులో ‘నిశ్శబ్దం’ అనే పేరు నిర్ణయించారు.

పూర్తిగా విదేశాల్లోనే చిత్రీకరించబడిన ఈ సినిమాకి తాజాగా విడుదల తేదీని ఖరారు చేశారు. జనవరి 31వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇందులో అనుష్క భర్త పాత్రలో మాధవన్ నటించగా, అంజలి .. షాలినీ పాండే ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడిసన్ కీలకమైన పాత్రను పోషించాడు. ‘భాగమతి’ తరువాత అనుష్క నుంచి వస్తున్న సినిమా కావడంతో సహజంగానే అంచనాలు వున్నాయి.