రెండ్రోజుల్లో రెండు పార్టీలు మారిన మహిళానేత

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు ఒక్కరోజు ముందు కూడా నిజామాబాద్ లో నాటకీయ పరిణామాలు, చేరికలతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సోమవారమే గులాబీ కండువా కప్పుకున్న బీజేపీ కార్పొరేటర్ నేడు.. మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు.

44వ డివిజన్ కార్పొరేటర్ బైకాన్ సుధ మొన్న హైదరాబాద్‌లో మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే గణేష్ గుప్తా ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇవాళ మళ్లీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీ నర్సయ్య రాష్ట్ర నాయకుడు సూర్యనారాయణ గుప్తా ఆధ్వర్యంలో సొంత గూటికి చేరుకున్నారు.