మళ్లీ బ్యాలెట్‌ వెళ్లే ప్రసక్తే లేదు : ఈసీ

ఈవీఎం విధానం ఎప్పుడూ వివాదాస్పదమే. దేశంలో ఎప్పుడు.. ఎక్కడ ఎన్నికలు జరిగినా ఈవీఎంపై అనుమానాలు రేకిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఢిల్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం ఓటింగ్‌ శాతం వెల్లడించం ఆలస్యం కావడంతో ఈవీఎంల పనితీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఓటింగ్‌ శాతం వెల్లడి ఆలస్యం కావడంతో ఆప్‌ నేతలు విమర్శలు గుప్పించారు. పోలింగ్‌ ముగిసిన తర్వాత ఎన్నికల సంఘం ఓటింగ్‌ శాతం ప్రకటించడానికి సిద్ధంగా లేకపోవడం చరిత్రలో ఇదే తొలిసారి అని ఎంపీ సంజయ్‌ సింగ్‌ విమర్శించారు.

ఈ నేపథ్యంలో ఓ ఆంగ్లపత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలు నిర్వహించే ప్రసక్తే లేదని.. ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) సునీల్‌ అరోరా అన్నారు. కారు, పెన్నులు మెరాయించినట్టు ఈవీఎంలలో కూడా సమస్యలు తలెత్తుత్తాయి. కానీ వాటిని ట్యాంపరింగ్‌ చేసే అవకాశం లేదని సునీల్‌ ఆరోరా తెలిపారు. 20 ఏళ్లుగా ఈవీఎంలు వాడుకలో ఉన్నాయని.. తిరిగి బ్యాలెట్‌ పేపర్‌ విధానానికి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.