జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి ప్రెస్ మీట్ నిర్వహించి షెడ్యూల్ వివరాలని తెలిపారు. ఈ సారి బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. చైర్మన్ పీఠాన్ని ఈ సారి జనరల్ మహిళకు కేటాయించినట్లు తెలిపారు.

ఈ సారి రిజర్వేషన్ల మార్పు ఉండదని స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్ వివరించారు. దీంతో రాజకీయ పార్టీలన్నీ బిజీ అయ్యాయి. దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు ఇచ్చిన జోష్‌తో జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ దూసుకుపోవాలని బీజేపీ భావిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాలకు బీజేపీ ఇన్‌చార్జ్‌లను నియమించింది.