వారెవ్వా .. ఎన్టీఆర్ క్యా సీన్ హై


ఎన్టీఆర్ అభిమానులకు బర్త్‌డే గిఫ్ట్‌ వచ్చేసింది. మే 20న ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చిత్ర బృందం ప్రత్యేక టీజర్‌ను విడుదల చేయాలని భావించింది. కానీ లాక్‌డౌన్‌ కారణంగా వీలులేకపోవడంతో టీజర్‌ రూపొందించడం కష్టంగా మారింది.

దీంతో నిరాశ చెందిన అభిమానుల్లో.. తారక్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ లాయిడ్‌ స్టీవెన్స్‌ కాస్త ఉత్సాహం నింపారు. ఎన్టీఆర్‌ సిక్స్‌ ప్యాక్‌తో ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘ఎవరూ ఇప్పటివరకూ చూడని తారక్‌ ఫొటోను పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా’’ అని చెప్పుకొచ్చారు. ఈ ఫోటో ఇపుడు వైరల్ గా మారింది.